Irumudi Movie Audience Review? ఇరుముడి మూవీ ట్విట్టర్ రివ్యూ?రేటింగ్?బలాలు, బలహీనతలు?

Irumudi Movie Audience Review? ఇరుముడి మూవీ ట్విట్టర్ రివ్యూ?రేటింగ్?బలాలు, బలహీనతలు?

మూవీ: ఇరుముడి

హీరో: మాస్ మహారాజ్ రవితేజ

హీరోయిన్: ప్రియ భవాని శంకర్

నటి నటులు: స్వసికా విజయ్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్

దర్శకుడు : శివ నిర్వాణ

నిర్మాత : మైత్రి మూవీ మేక్స్

రివ్యూ :

. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన లెటెస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్ సమర్పణలో సినిమా తెరకెక్కింది. శివ్ చనానా సహ నిర్మాతగా వ్యవహరించారు.

. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్‌ చేశారు. యాక్షన్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రవితేజను సరికొత్త కోణంలో చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

. ఈరోజు us లో ప్రీమియర్ సోర్స్ చూసిన అభిమానులు సినిమా అనుభవాన్ని పంచుకున్నారు. ఒక అభిమాని మాటల్లో సినిమా 1స్ట హాఫ్ చాలా డీసెంట్ గా ఉందని, సెకండ్ హాఫ్ కొంచం నెమ్మదించినదని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కానీ మొత్తానికి రవితేజ కి మంచి కంబ్యాక్ సినిమా అవుతుందని కొద్ది రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చెప్పుకొచ్చాడు.

మాస్ మహారాజ్ రవితేజ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని ఎప్పటిలాగానే చాలా ఎనర్జిటిక్ గ ఇరగదీశాడు అని ఫ్యాన్స్ ఖుషీ ఫీల్ అవుతున్నారు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రవితేజ కూతురిగా నటించిన బేబీ నక్షత్ర చాలా బాగా మెప్పించింది. సినిమాకి బేబీ నక్షత్ర చాలా పెద్ద ప్లస్ అవుతుంది.

సాయి కుమార్ పవర్ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మూవీ లో ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటాయి.

మూవీ లో వచ్చే ఆధ్యాత్మిక సన్నివేశాలు, పాటలు సగటు ప్రేక్షకుడిని మైమరపించేలా చేస్తాయి. మల్లెపూల పల్లకి పాటకి థియేటర్ మొత్తం ఊగిపోయేలా ఉంది ప్రతి ఒక్కరు సీటు నుంచి లేచి డాన్స్ లతో థియేటర్ మొత్తాన్ని ఊపేస్తున్నారు. కొందరు ఏకంగా హారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మాస్స్ మహారాజ్ రవితేజ నటన అదిరిపోతుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా మంచిగా మేనేజ్ చేశాడు. జీ వి ప్రకాష్ అందించిన పాటలు bgm మూవీ కి పెద్ద ప్లస్ గా నిలుస్తాయి. అన్ని మూవీస్ లో లాగా క్షణం కొద్ది నెమ్మదిగా ఉన్న మధ్యలో బ్యాచ్ ఆధ్యాత్మిక సన్నివేశాలు కథనాన్ని డామినేట్ చేస్తాయి..

మొత్తానికి సినిమా ఫ్యాన్స్ కి కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేసేలా ముఖ్యం గా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా తీయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

చివరగా కుటుంబ సమేతంగా మూవీ కి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చు.

రేటింగ్ : 3.5/5*

ఈ రివ్యూ కేవలం సగటు ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *