Stock market ట్రేడ్ చేసేవారికి పోలీస్ శాఖ వారి హెచ్చరిక – భారీ మోసాల పట్ల జాగ్రత్త

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో వల వేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, వాట్సాప్‌, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
తెలియని వ్యక్తులు పంపించే లింకులు, యాప్‌లు, పెట్టుబడి సూచనలు నమ్మకుండా.. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ వివరాలను పూర్తిగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని, అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో డాక్టర్‌కు భారీ సైబర్ మోసం.. ₹1.49 కోట్లు పోయాయి

హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన 34 ఏళ్ల ప్రైవేట్‌ వైద్యుడు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మోసానికి గురై ₹1,49,33,593 కోల్పోయారు. ఈ ఘటనపై మల్కాజిగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మే 4న స్టాక్‌ మార్కెట్‌, పెట్టుబడులకు సంబంధించిన టెలిగ్రామ్‌ గ్రూప్‌లో డాక్టర్‌ చేరారు. అనంతరం వాట్సాప్‌ ద్వారా కొందరు తమను ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణులుగా పరిచయం చేసుకున్నారు. వారిలో ఓ మహిళ తనను మైరా శర్మగా పరిచయం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వారు పంపిన వెబ్‌సైట్‌ ద్వారా డాక్టర్‌ నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మే 4 నుంచి జూన్‌ 29 వరకు 59 లావాదేవీల్లో ₹1.49 కోట్లకు పైగా ఆ యాప్‌కు బదిలీ చేశారు.

తర్వాత యాప్‌లో పెట్టుబడులు భారీగా పెరిగినట్లు చూపించారు. డబ్బును తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా “క్రెడిట్‌ స్కోర్‌ పడిపోయింది” అంటూ విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు. డబ్బు విడుదల కావాలంటే మరిన్ని చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

⚠️ పోలీసుల హెచ్చరిక

టెలిగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా వచ్చే “అధిక లాభాలు”, “గ్యారంటీడ్‌ రిటర్న్స్‌” పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లు మొదట భారీ లాభాలు చూపించి, డబ్బు విత్‌డ్రా చేసే సమయంలో ట్యాక్స్‌, ఫీజులు లేదా ఇతర పేర్లతో అదనపు డబ్బు అడగడం ఈ తరహా మోసాల్లో సాధారణ పద్ధతి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టండి.. కానీ జాగ్రత్తగా, పూర్తి అవగాహనతోనే పెట్టుబడి పెట్టండి.

Related Posts

RBI కీలక నిర్ణయం.. 5.25 శాతంగా రెపో రేటు కొనసాగింపు, GDP వృద్ధిపై అంచనాలు

RBI రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించినట్లు తాజా సమాచారం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనా 6.7 శాతంగా ఉంది. ఈ నిర్ణయం రుణాలు, EMIలు, డిపాజిట్లు, పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఢిల్లీ డివిజన్‌లో 120కుపైగా రైళ్లపై ప్రభావం.. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ప్రయాణికులకు ఇబ్బందులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన సమాచారం వెలువడింది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీ డివిజన్‌లో చేపడుతున్న పలు రైల్వే పనులు, నిర్వహణ చర్యల కారణంగా 120కుపైగా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనున్నట్లు తాజా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ధృవ్ విక్రమ్–రమేష్ వర్మ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. యాక్షన్‌ ట్రీట్‌కు రంగం సిద్ధం

ధృవ్ విక్రమ్–రమేష్ వర్మ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. యాక్షన్‌ ట్రీట్‌కు రంగం సిద్ధం

D-10’ విజేత డ్యాన్సర్ రాజు అరెస్ట్

D-10’ విజేత డ్యాన్సర్ రాజు అరెస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10లో కొత్త టాస్క్…. హార్ట్ అండ్ హార్ట్ break

బిగ్‌బాస్ తెలుగు 10లో కొత్త టాస్క్…. హార్ట్ అండ్ హార్ట్ break

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!

నాన్న పాత సైకిల్ – పాత సైకిల్ వెనుక ఉన్న నాన్న కష్టం

నాన్న పాత సైకిల్ – పాత సైకిల్ వెనుక ఉన్న నాన్న కష్టం