పూతనా మోక్షం, శకటాసుర భంజనం & నామకరణం- శ్రీమద్భాగవతం

శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన కొన్ని రోజుల తరువాత నందుడు, గోకులం రక్షణ బాధ్యతలు గోపాలురకు అప్పగించి, తాను ప్రతి సంవత్సరం కంసునకు చెల్లించాల్సిన వార్షిక కప్పం చెల్లించడం కోసం మధురకు వెళ్ళాడు. సోదరుడు అయిన నందుడు మధురకు వచ్చి కప్పం కట్టిన సంగతి తెలుసుకుని నందుడు బస చేసిన చోటుకు వెళ్లాడు, నందుడు ఎంతో ప్రేమ కురిపించాడు.

వసుదేవుడు బలరామకృష్ణుల క్షేమ సమాచారం అడిగి మహనీయులు మీ వంశంలో పుట్టారు అని కొనియాడి. నందా నీవు త్వరగా గోకులానికి వెళ్ళు గోకులంలో ఎన్నో ఉత్పాతాలు జరుగుతున్నాయి అన్నాడు. వసుదేవుడు ఏది ఊరికే అనడు అని నందుడు వెంటనే వారీ ఎడ్ల బండ్లపై బయలు దేరారు.

కంసుని ఆజ్ఞతో శిశువులను సంహరించే క్రూర రాక్షసి పూతననగరాలు, పట్టణాల్లో తిరుగుతూ శిశువులను సంహరిస్తూ గోకులానికి వచ్చింది.ఆమె కామచరి(కోరిన రూపం పొందగలదు)ఒక అద్భుతమైన సుందర రూపవతిగా మారి, నంద భవనంలోకి ప్రవేశించింది. ఆమె రూప సౌందర్యానికి ముగ్ధులై యశోదా రోహిణులు గోపికలు ఆమెను దేవతగా భావించి అడ్డుకోలేదు.

  • విషస్తన్యం:* ఆ సమయంలో బాలకృష్ణుడు నివురు గప్పిన నిప్పులా తన తేజస్సును కప్పిపుచ్చుకుని, వచ్చినది శిశువులను చంపే రాక్షసి అని గ్రహించి శయ్యపై కనులు మూసుకుని ఉన్నాడు.

అంతటా ఆ పూతన ప్రాణాంతమైన పామును, తాడు అని భ్రమించి చేతిలోకి తీసుకున్నట్టు, అనంతుడు అయిన ఆ ప్రభువును ఒడిలోకి తీసుకుని విషపూరిత మయిన తన స్తన్యం(పాలివ్వడం)ఇవ్వడం ప్రారంభించింది.

అంతట కృష్ణపరమాత్మ రోషోద్దీపితుడై, తన రెండు చేతులతో ఆ రక్కసి స్తనమును గట్టిగా అదిమిపట్టుకొని, దాని ప్రాణములతో సహా స్తన్యమును పీల్చివేసెను.పాలతో పాటు పూతన యొక్క ప్రాణవాయువులను కూడా గట్టిగా పీల్చివేశాడు.

దాంతో ఆ రాక్షసి శరీరంలోని ఆయువు పట్టులన్నీ పటుత్వం కోల్పోయాయి,ప్రాణాలు పోతున్న వేదనతో పూతన పాలు త్రాగినంత చాలు ఇక “వదులు.. వదులు..” అని మొత్తుకునెను.

ఈ విధంగా ఆ రాక్షసి స్తనాలు శిధిలం అయ్యాయి, చేతులు చల్లబడి నీల్గుకుని పోయాయి, అంతటితో ఆ పూతన అసువులు కోల్పోయి. తన సహజమైన రాక్షస రూపంతో గోకులం వెలుపల పడిపోయింది. ఆమె అసలైన రాక్షసి శరీరం ఆరు క్రోసుల (దాదాపు 18 కిలోమీటర్ల) విస్తీర్ణంలో పడి చెట్లను కూల్చివేసింది.

అంతకుముందే దాని గావుకేకలకు గోపాలుర హృదయాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు ఇంత పెద్ద కళేబరం చూసి భయంతో వణికి పోయాయి.

బాలకృష్ణుడు మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా ఆ రాక్షసి వక్షం మీదే ఆడుకుంటూ ఉన్నాడు. అదిచూసి గోపికలు ఆశ్చర్య పోయి స్వామి ని ఎత్తుకున్నారు(నేను స్వామి అంటున్నాను వారికి బాలుడే), అమ్మో పెద్ద గండం తప్పింది అని రోహిణి దేవి, యశోదా మాత,బాబుకు గోవు తోకను తిప్పివేయడం వంటి అనేక రీతులతో దిష్టి తీసి రక్ష పెట్టారు. యశోద దేవి పాలిచ్చి పడుకోబెట్టింది.(ఇక్కడ బాల రక్షా కవచం కూడా ఉంటుంది)

అంతలోనే మధుర నుండి బయలు దేరిన నందుడు మొదలగు వారు వచ్చారు, అంత పెద్ద కళేబరం చూసే ఆశ్చర్యపోయి, వసుదేవుడు సామాన్యుడు కాదు ముందే మనల్ని హెచ్చరించాడు అని భావించి.ఆ పూతన శరీరాన్ని గండ్రగొడ్డల్లతో ముక్కలు చేసి గోకులానికి దూరంగా తీసుకువెళ్ళి కాల్చివేశారు

  • ధాత్రి గతి (మోక్షం): చంపడానికి వచ్చినప్పటికీ, కృష్ణునికి ‘తల్లిలా’ స్తన్యమిచ్చినందుకు పరమాత్మ ఆమెకు మాతృ సమానమైన సద్గతిని (వైకుంఠ ప్రాప్తిని) ప్రసాదించాడు. ఆమె శరీరాన్ని దహనం చేస్తుంటే అగరు సువాసనలు వెలువడ్డాయి!

విషం ఇవ్వాలని వచ్చిన పూతనకే మోక్షం ఇచ్చిన స్వామి, ప్రేమతో పత్రము,పుష్పం, ఫలం ఇస్తే ఇంకెన్నీ ఇస్తాడు ఆయన ఇవ్వలేనిది ఏది లేదు…

శకటాసుర భంజనం.

బాలకృష్ణునికి మూడు నెలలు నిండిన శుభదినాన ఉత్థాన ఉత్సవం(బోర్లగిల పడుకున్నాడు అని)యశోద బంధువులను, బ్రాహ్మణులను పిలిచి వేడుక చేసింది. బ్రాహ్మణులకు గోదానము చేశారు,వారు వేదాశీర్వచనాలు ఇచ్చారు.వీణా,వేణు, మృదంగాది ధ్వనులు, మధురా గీతాలు ఆలపించారు.

ఇంతలో చిన్నికృష్ణయ్య కు నిద్ర ముంచుకురాగా యశోదాదేవి మెత్తని శయ్యపై పడుకోబెట్టి అతిథులను సత్కరించడంలో నిమగ్నమైంది.

ఇంతలో ఆకలి వేసి ఏడవసాగాడు బాలుడు, సందడిలో తల్లికి అది వినపడలేదు, స్తన్యం కోసం గుక్కపట్టి ఏడుస్తూ కన్నయ్య తన రెండు కాళ్ళను గట్టిగా పైకి తన్నాడు.

చిన్ని కృష్ణుడు ఒక బండి కింద శయ్యపై పడుకుని ఉన్నాడు, ఆకలితో పాదాలు అటు ఇటు ఆడిస్తూ, తన మృదువైన పాదాలతో బండిని తన్నాడు

  • అసురావేశం: కంసుని అనుచరుడైన శకటాసురుడు అనే రాక్షసుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ బండిపై ఆవహించి, బండిని విరిచి కృష్ణుడిని నలిపివేయాలని చూశాడు.
  • పాద స్పర్శ: ఆకలితో ఏడుస్తున్నట్లు నటించిన చిన్నికృష్ణుడు తన లేత పాదాన్ని పైకెత్తి బండిని ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు బండి ముక్కలై ఆకాశంలోకి ఎగిరి పడింది; చక్రాలు, ఇరుసులు విరిగిపోయి శకటాసురుడు రక్తాలు కక్కుకుని ప్రాణాలు విడిచాడు.

మహోత్సవమునకు అచట చేరియున్న యశోదాదేవి మొదలగు ప్రముఖ స్త్రీలు, గోపికలును, నందుడు మున్నగు గోపాలురును ఆ అద్భుత దృశ్యమును గాంచిరి. అంతట వారు ఆ అద్భుత సంఘటనమునకు మిగుల వ్యాకులము నొందిరి (కంగారుపడిరి). ‘అయ్యయ్యో! ఈ బండి తనంతటతానే ఎట్లు తలక్రిందులైనది?” అని ఆశ్చర్యమునకు లోనై తికమకపడ్డారు

“శయ్యపై ఏడ్చుచున్న కృష్ణుడు తన పాదములతో తన్నుటవలన వాటి తాకిడికి ఈ బండి తలక్రిందులై ఇట్లైనది.అని అక్కడ ఆడుకునే పిల్లలు అంటే ఇంత చిన్నపిల్లాడి కాళ్ళు తగిలితే బండి ముక్కలు అవుతుందా అని ఎవరు పట్టించుకోలేదు. స్వామి మాయను దాటడం అందరికీ సాధ్యమా.

Related Posts

శ్రీ మద్భాగవతం – బ్రహ్మమోహన లీల – శ్రీకృష్ణుని దివ్య మహిమ | బ్రహ్మదేవుని స్తుతి

బ్రహ్మమోహన లీల – శ్రీకృష్ణుని దివ్య మహిమ | బ్రహ్మదేవుని స్తుతి ఈ అఘాసుర సంహారం కౌమార ప్రాయం లో జరిగితే ప్రౌగండ ప్రాయంలో గోపాలకులు బృందావనం లో చెప్పారు అని శుక మహర్షి అంటే అదేమిటి అంత కాలం వారు…

శ్రీ మద్భాగవతం – వత్సాసుర, బకాసుర వధ & అఘాసుర మోక్షం

వత్సాసుర, బకాసుర వధ & అఘాసుర మోక్షం బృందావనంలో గోవత్స పాలన వత్సాసుర సంహార బకాసుర వధ అఘాసురుని ఆగమనం & కొండచిలువ గుహ (12వ అధ్యాయం) అఘాసుర సంహారం & దివ్య తేజో లీనం ఈ లీలల సందేశంవత్సాసురుడు –…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ధృవ్ విక్రమ్–రమేష్ వర్మ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. యాక్షన్‌ ట్రీట్‌కు రంగం సిద్ధం

ధృవ్ విక్రమ్–రమేష్ వర్మ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. యాక్షన్‌ ట్రీట్‌కు రంగం సిద్ధం

D-10’ విజేత డ్యాన్సర్ రాజు అరెస్ట్

D-10’ విజేత డ్యాన్సర్ రాజు అరెస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10లో కొత్త టాస్క్…. హార్ట్ అండ్ హార్ట్ break

బిగ్‌బాస్ తెలుగు 10లో కొత్త టాస్క్…. హార్ట్ అండ్ హార్ట్ break

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!

నాన్న పాత సైకిల్ – పాత సైకిల్ వెనుక ఉన్న నాన్న కష్టం

నాన్న పాత సైకిల్ – పాత సైకిల్ వెనుక ఉన్న నాన్న కష్టం