Vidhuranithi NEWS:
2026 సంవత్సరం లో వినాయక చవితి పండగ సెప్టెంబర్ 14 న రాబోతుంది. వినాయక చవితి ఎంత స్పెషల్ పండగో అందరికి తెలిసిందే ముందు సంవత్సరం వినాయక నిమజ్జనం రోజు నుంచే మరల బ్యాచ్ సంవత్సరం ఇంకా గ్రాండ్ గా ఎలా చేయాలో ముందుగానే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు భక్తులు. మామూలు రోజుల్లో ఎంత మంచిగా కలిసి మెలిసి తిరిగి స్నేహితులు అయినా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఒకరికి మించి ఇంకొకరు వాళ్ళకి మించి ఇంకొకరు , మండపం డెకొరేషన్ నుండి విగ్రహం ఎత్తు , పూజలు, ముఖ్యంగా ప్రసాదాలు, అన్నదానాలు ఇలా 9 రోజులు ఒకే ఇతి చివరి రోజు నిమజ్జనం రోజు DJ సౌండ్ పెట్టి అందరూ సరదాగా గడుపుతారు.
వినాయక చవితి రోజున పట్టణాలు పల్లెలు నగరాలు అని తేడా లేకుండా అందరూ , అపార్ట్‌మెంట్లలో, వీధుల్లో మరియు వివిధ ప్రాంతాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. పూజా మండపాలను రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దుతారు
ప్రతిష్ఠ అనంతరం గణపతికి షోడశోపచార పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పసుపు, కుంకుమ, పుష్పాలు, దుర్వా గడ్డి మరియు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
వినాయక చవితి సందర్భంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి సామూహికంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం పూజలు, మధ్యాహ్నం ప్రసాద పంపిణీ, సాయంత్రం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉంది.
పిల్లలు, యువత ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. గణపతి మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిర్ణయించిన రోజున గణపతి నిమజ్జనం నిర్వహిస్తారు. భక్తులు ఊరేగింపుగా గణపతి విగ్రహాన్ని తీసుకెళ్లి భక్తిగీతాలు, భజనల మధ్య నిమజ్జనం చేస్తారు.“గణపతి బప్పా మోరియా” అంటూ భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలుకుతారు. స్వామివారు తమ కుటుంబాలకు శుభం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తారు.
కానీ ఈ మధ్య కాలంలో ఫంక్షన్ ఏదైనా డీజే మాత్రం సర్వ సాధారణం అయింది.కానీ కొంతమంది ఆ డీజే ముందు డాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో దురదృష్ట వశాత్తూ మరణించిన సంఘటనలను చూస్తూనే ఉన్నాం.అందుకే వినయ నిమజ్జనం రోజున డీజే నీ బాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి, ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి , నిమజ్జన ఊరేగింపుల సమయంలో అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్ సిస్టమ్‌లపై పూర్తి నిషేధాన్ని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ మరియు స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు.
నిబంధనలను ఉల్లంఘించి, ఊరేగింపుల సమయంలో డీజే సెటప్‌లను ఉపయోగించడానికి ప్రయత్నించే నిర్వాహకులపై, పరికరాలను స్వాధీనం చేసుకోవడం మరియు జరిమానాలతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
అధిక శబ్దం చేసే రీమిక్స్/డీజే సిస్టమ్‌లకు బదులుగా,ధోల్ మరియు తాషా వంటి సాంప్రదాయ వాయిద్యాలను లేదా సాంప్రదాయ బ్యాండ్‌లను అధికారులు ప్రోత్సహిస్తున్నారు .








