శ్రీ మద్భాగవతం – వత్సాసుర, బకాసుర వధ & అఘాసుర మోక్షం

వత్సాసుర, బకాసుర వధ & అఘాసుర మోక్షం

బృందావనంలో గోవత్స పాలన

  • బృందావనానికి చేరుకున్న తర్వాత అందరిని తమ ముద్దు మీ. ముద్దు మాటలు అల్లరి చేష్టలతో ఆనందింప చేస్తూ కాలక్రమమున రామకృష్ణులు కొద్దిగా పెద్దవారై ‘పౌగండ’ వయస్సుకు చేరుకున్నారు. వారు కూడా తోటి గోపబాలురతో కలిసి దూడలను (గోవత్సాలను) మేపడానికి అడవులకు వెళ్లడం ప్రారంభించారు.
  • పిల్లనగ్రోవి (మురళి) ఊదుతూ, నెమలి పింఛాన్ని శిరస్సున ధరించి, పక్షుల కిలకిలారావాలను అనుకరిస్తూ, కోతులతో గెంతుతూ బృందావన వనాలలో బాలకృష్ణుడు సృష్టించిన ఆనందం వర్ణనాతీతం.
  • ఏమి అదృష్టమో ఆ గోప బాలురది జగత్తును లీలగా తన మాయచే ఆడించే జగన్నాటక సూత్రధారి వారితో ఆటలు ఆడాడు, గంతులు వేశాడు, కేరింతలు కొట్టాడు,మాట్లాడడు, ఆటల్లో భాగంగా పోట్లాడాడు ఆహా స్వామి చర్యలు ఊహాతీతం పరమాత్మ అనుగ్రహం వర్ణనాతీతం.

వత్సాసుర సంహార

  • అలా ఒకరోజు రామకృష్ణులు యమునా నదీ తీరాన దూడలను మేపుతుండగా, కంసుని అనుచరుడైన ఒక రాక్షసుడు ఒక దూడ రూపాన్ని ధరించి (వత్సాసురుడు) దూడల మందలో కలిసిపోయాడు. కృష్ణుడిపై దాడి చేయడానికి అదను కోసం చూస్తున్నాడు.అది గమనించిన అంతర్యామియైన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడి కపట రూపాన్ని బలరామునికి కనుసైగతో బలరాముని తెలుపుచు, అమాయకుని వలె
  • మెల్లగా ఆ దూడ వెనుకకు వెళ్లి, దాని రెండు వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పి ఒక వెలగ చెట్టుపైకి విసిరికొట్టాడు. ఆ దెబ్బకు చెట్టు పండ్లతో సహా నేలకూలింది; వత్సాసురుడు ప్రాణాలు విడిచాడు. తోటి గోపబాలురు “శ్రీకృష్ణా! ఎంత గొప్ప పని చేశావు!” అంటూ పరమానందంతో జయజయధ్వానాలు చేశారు.

బకాసుర వధ

  • అలా మరొకరోజు గోపబాలురంతా, ఆవులతో సహా దప్పిక గని ఒక పెద్ద సరస్సు వద్దకు వెళ్ళి నీళ్లు తాగుతుండగా, అక్కడ ఒక పెద్ద కొండశిఖరం వంటి ఆకారం కనిపించింది. అది కంసుడు పంపిన బకాసురుడు అనే రాక్షసుడు. ఆయన ఒక భయంకరమైన పెద్ద కొంగ (బకము) రూపాన్ని ధరించి ఉన్నాడు.దాన్ని చూసి అందరూ బయటపడ్డారు.
  • అంతలోనే బకాసురుడు తన వాడియైన ముక్కుతో కృష్ణుడిని అమాంతం నోట్లో వేసుకుని మింగివేశాడు. అది చూసి బలరామాది గోపబాలురు భయంతో మూర్ఛపోయారు.
  • సాక్షాత్తు సమస్త బ్రహ్మాండాలకు ఆధారమైన పరమాత్మ బకాసురుని గొంతులోకి వెళ్లగానే… ఆయన గొంతులో కార్చిచ్చు పెట్టినట్లు తీవ్రమైన మంట పుట్టింది. ఆ వేడిని తాళలేక బకాసురుడు కృష్ణుడిని బయటకు కక్కివేశాడు.
  • కక్కిన వెంటనే మళ్లీ ముక్కుతో పొడవడానికి రాగా, శ్రీకృష్ణుడు ఒడుపుతో ఆ రాక్షస కొంగ ముక్కు రెండు రెక్కలను రెండు చేతులతో పట్టుకుని, దర్భపుల్లను చీల్చినట్లుగా నిలువుగా చీల్చి సంహరించాడు. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు.
  • తమ చిన్ని కృష్ణునికి ఏమి కానందుకు గోపబాలురు అంతా కేరింతలు కొట్టారు, అంతా తిరిగి బృందావనానికి ఆవులు తోలుకొని వచ్చారు.బలరామకృష్ణులు గోపబాలురతోగూడి దాగుడుమూత లాడుచుండిరి. అప్పుడప్పుడు ఉత్తుత్తి సేతుబంధన క్రీడలను (ఆనకట్టలు వేయుట, పిట్టగూళ్లు కట్టుట మున్నగు ఆటలను) నడపుచుండిరి, అట్లే కోతులవలె గంతులు వేయుచు చెట్లపైనను ఆడుకొనుచుండిరి. ఈవిధముగా వారు ఈడునకు తగిన క్రీడలతో తమ కౌమారవయస్సును హాయిగా ఆటపాటలతో గడపిరి.

అఘాసురుని ఆగమనం & కొండచిలువ గుహ (12వ అధ్యాయం)

  • ఒకనాడు శ్రీకృష్ణుడు వనభోజనమునకు సంకల్పించి, ప్రాతఃకాలమునందే నిద్రనుండి మేల్కొనెను. ఆ తర్వాత ఆ స్వామి ఇంపైన కొమ్మువాద్యధ్వనితో తన మిత్రులైన గోపబాలురను మేల్కొల్పి, ఆవుదూడలను ముందుభాగమున నడపుచు వ్రజభూమి (బృందావనము) నుండి బయలుదేరెను.
  • అప్పుడు పరస్పర ప్రేమానురాగములుగల వేలకొలది గోపబాలురు చక్కని చిక్కములను, బెత్తములను, కొమ్ములను, పిల్లనగ్రోవులను తీసికొని, అసంఖ్యాకములైన తమ తమ గోవత్సములను ముందుభాగమున నడిపించుచు, శ్రీకృష్ణునితోపాటు సంతోషముగా బయలుదేరిరి.
  • ఆనాడు వారంతా ఎంతో సంతోషంగా ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ గడుపుతూ ఉన్నారు.
  • ఇంద్రియములను, అంతఃకరణమును వశపరచుకొని, అనేక జన్మలలో పలుశ్రమలకోర్చి వివిధరీతుల తపస్సులు ఒనర్చిన యోగిపుంగవులు సైతము ఆ శ్రీహరి (శ్రీకృష్ణుని) పాదరేణువుల దర్శనభాగ్యమునకు నోచుకొనరు. అట్టి కృష్ణపరమాత్మను నిరంతరము స్వయముగా దర్శించుచు ఆ స్వామితోగూడి యాడెడి ఈ గోపబాలురయొక్క అదృష్టమును ఎంతని వర్ణింపగలము?
  • ఆ గోపబాలురు అందరును ఇట్లు హాయిగా ఆడుకొనుచుండిరి. వారి ఆనంద విహారములను జూచి ఓర్వలేక ‘అఘాసురుడు’ అను ఒక గొప్ప రాక్షసుడు హఠాత్తుగా అచటికి వచ్చి వాలెను. అతడు
  • పూతన, బకాసురుల సోదరుడు తన తోబుట్టువులను చంపిన కృష్ణుడిపై పగ తీర్చుకోవడానికి వచ్చాడు.
  • ఆయన ఎనిమిది మైళ్ల (ఒక యోజనం) పొడవున్న ఒక మహా కొండచిలువ (సర్పం) రూపాన్ని ధరించి, రహదారి మధ్యలో పడుకున్నాడు.
  • గుహ లాంటి నోరుతో తన క్రింది పెదవిని భూమిపై, పై పెదవిని ఆకాశంలో మేఘాలకు ఆనించి, నోటిని ఒక పెద్ద కొండగుహలా తెరిచి ఉంచాడు. ఆయన నాలుక ఎర్రటి దారిలా, నోటి నుండి వచ్చే శ్వాస వేడి గాలిలా, కళ్లు మండుతున్న నిప్పులలా ఉన్నాయి.
  • అక్కడ స్వేచ్చగా విహరించుచున్న గోపబాలులు అందఱును దానిని జూచి, ‘విహారభూమి అయిన బృందావనము నందు ఇదియొక భాగమేమో?’ అని తలంచి. గుహాకృతితో నున్న ఆ దృశ్యము వారికి తెఱచుకొనియున్న ఒక మహాసర్పముయొక్క ముఖముగా తోచెను. (అనిపించెను)
  • మనము దీని ముఖమునందు. ప్రవేశించినచో ఇది మనలను కబళించివేయునా? అట్లు చేయుట దీనివలన కానిపని. ఒకవేళ ఇది మనలను మ్రింగివేయుటకు పూనుకొనినను (ఇంతకుముందు కృష్ణునిచేతిలో చచ్చిన బకాసురునివలె) వెంటనే నశించును.
  • మన కృష్ణయ్య దీనిపని పట్టకుండునా?” ఈవిధముగా పలికిన పిమ్మట ఆ గోపబాలకులు అందఱును శ్రీకృష్ణుని సుందరవదనమును చూచుచు, మనకు తోడునీడగా శ్రీకృష్ణుడు గలడను ధీమాతో బిగ్గఱగా నవ్వుచు, చప్పట్లు చఱచుచు ఆ అజగరముఖములో ప్రవేశించిరి.(నమ్ముకున్న వాడిని మృత్యు ముఖం నుండి కూడా బయట పడేసే అపార కరుణాసముద్రుడు నా తండ్రి)

అఘాసుర సంహారం & దివ్య తేజో లీనం

  • గోపబాలురు లోపలికి వెళ్లిన తర్వాత కూడా వాడు నోరు మూయలేదు ఎందుకుంటే వాడి పగ శ్రీకృష్ణ పరమాత్మ మీద కదా, వారిని రక్షించడం కోసం పరమాత్మ శ్రీకృష్ణుడు కూడా ఆ కొండచిలువ నోట్లోకి ప్రవేశించాడు. వెంటనే రాక్షసుడు సంతోషంతో నోరు మూయడానికి సిద్ధమయ్యాడు.
  • వెంటనే శ్రీకృష్ణుడు ఆ అఘాసురుని గొంతులోనే ఉండి తన శరీరాన్ని అనంతంగా పెంచడం ప్రారంభించాడు.దాంతో రాక్షసునికి ఊపిరాడక కళ్లు బయటకు వచ్చాయి; గొంతు పగిలిపోయి బ్రహ్మరంధ్రం నుండి ప్రాణాలు అనంత ఆకాశంలోకి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణుడు తన అమృత దృష్టితో స్పృశించి లోపల మూర్ఛపోయిన గోపబాలురను, దూడలను బ్రతికించి క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు.
  • దివ్య మోక్షం: అఘాసురుని శరీరం నుండి వెలువడిన ఒక దివ్యజ్యోతి ఆకాశంలో వేచి ఉండి, శ్రీకృష్ణుడు బయటకు రాగానే సమస్త దేవతలు చూస్తుండగా శ్రీకృష్ణుని పాదపద్మాలలో లీనమైంది!
  • దేవతలు అంతా స్వామిని స్తుతించారుఅవి బ్రహ్మలోకానికి వినపడ్డాయి బ్రహ్మదేవుడు తన వాహనముపై అచటికి చేరి, శ్రీకృష్ణమహిమను కన్నులార దర్శించి ఆశ్చర్యమున మునిగిపోయెను.
  • పరీక్షిన్మహారాజా! ఆ కొండచిలువయొక్క చర్మము ఎండిపోయి, ఒక గుహాకారమున విలసిల్లెను. పిమ్మట బృందావనమునందలి గోపబాలురకు అందఱకును పెక్కుదినములవఱకు అది అద్భుతమైన ఒక క్రీడాభూమిగా కౌమారవయస్సునందు ఉపయోగపడెను.
  • **పాపినాశకుడైన అఘహరుడు:** ‘అఘము’ అంటే పాపము. అఘాసుర సంహారం అంటే భగవంతుని శరణుజొచ్చిన సాధకుడి సమస్త పాపాలను శ్రీహరి దహించివేస్తాడనడానికి ప్రతీక. 2. **రాక్షసులకైనా మోక్షం:** కృష్ణుని చేతిలో మరణించిన పూతన, బకాసుర, అఘాసురుల వంటి క్రూరులకు కూడా పరమాత్మ సాయుజ్య ముక్తిని ప్రసాదించాడు.
  • రాక్షసులకైనా మోక్షం:** కృష్ణుని చేతిలో మరణించిన పూతన, బకాసుర, అఘాసురుల వంటి క్రూరులకు కూడా పరమాత్మ సాయుజ్య ముక్తిని ప్రసాదించాడు.

ఈ లీలల సందేశం
వత్సాసురుడు – కపటత్వానికి ప్రతీక.
బకాసురుడు – దంభం, కఠినత్వానికి ప్రతీక.
అఘాసురుడు – పాపం, క్రూరత్వానికి ప్రతీక.
శ్రీకృష్ణుని స్మరణ, భక్తి, శరణాగతి మనలోని ఈ దుష్ప్రవృత్తులను తొలగించి మనలను ధర్మమార్గంలో నడిపిస్తాయి.

కృష్ణం వందే జగద్గురుమ్” 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ!

Related Posts

శ్రీ మద్భాగవతం – బ్రహ్మమోహన లీల – శ్రీకృష్ణుని దివ్య మహిమ | బ్రహ్మదేవుని స్తుతి

బ్రహ్మమోహన లీల – శ్రీకృష్ణుని దివ్య మహిమ | బ్రహ్మదేవుని స్తుతి ఈ అఘాసుర సంహారం కౌమార ప్రాయం లో జరిగితే ప్రౌగండ ప్రాయంలో గోపాలకులు బృందావనం లో చెప్పారు అని శుక మహర్షి అంటే అదేమిటి అంత కాలం వారు…

శివ లింగోద్భవం – శివలీల

మహాశివలింగ ఆవిర్భావం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ధృవ్ విక్రమ్–రమేష్ వర్మ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. యాక్షన్‌ ట్రీట్‌కు రంగం సిద్ధం

ధృవ్ విక్రమ్–రమేష్ వర్మ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. యాక్షన్‌ ట్రీట్‌కు రంగం సిద్ధం

D-10’ విజేత డ్యాన్సర్ రాజు అరెస్ట్

D-10’ విజేత డ్యాన్సర్ రాజు అరెస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10లో కొత్త టాస్క్…. హార్ట్ అండ్ హార్ట్ break

బిగ్‌బాస్ తెలుగు 10లో కొత్త టాస్క్…. హార్ట్ అండ్ హార్ట్ break

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10లో హైడ్రామా.. ఇద్దరి మధ్య ముదిరిన వివాదం!

నాన్న పాత సైకిల్ – పాత సైకిల్ వెనుక ఉన్న నాన్న కష్టం

నాన్న పాత సైకిల్ – పాత సైకిల్ వెనుక ఉన్న నాన్న కష్టం